ప్రజలకు 1+6 సీఎం ఆఫర్ :  కేటీఆర్

  • ఇప్పటివరకు ఎవరూ చూసి ఉండరు : కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల అదృష్టమోఏమోగానీ.. ఒక్క సీఎంను ఎన్నుకుంటే మరో అర డజన్ మంది సీఎంలు ఫ్రీగా వచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. 1+6 సీఎం ఆఫర్​ను స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ చూసి ఉండరని శుక్రవారం ఓ ట్వీట్​లో పేర్కొన్నారు. ‘‘వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు!.. సీఎం రేవంత్ రెడ్డికి.. నాది ఒక చిన్న విన్నపం.. మీది ప్రజా పాలన కాబట్టి ప్రజలకు మీ అనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.. అందుకు ఐవీఆర్ఎస్ పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండి’’ అని ట్వీట్​లో పేర్కొన్నారు.